NTV Telugu Site icon

Ambati Rambabu: బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలయ్య మీకు ఇదే సరైన సమయం..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.. చంద్రబాబుది అక్రమ అరెస్ట్‌ అంటూ టీడీపీ సభ్యులు రెండో రోజూ కూడా ఆందోళనకు దిగారు.. అయితే, టీడీపీ సభ్యులకు కౌంటర్‌గా సభలో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. నందమూరి బాలకృష్ణకు సలహా ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు అంబటి..

Read Also: India-Canada: కెనడాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. దెబ్బకు కంపెనీ క్లోజ్

అంతే కాదు.. మీ బావ (చంద్రబాబు) జైల్లో… అల్లుడు (లోకేష్‌) ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి.. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా.. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతావు అంటూ హెచ్చరించారు. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి.. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో.. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి అంటూ సవాల్‌ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు మంత్రి అంబటి.. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారన్న ఆయన.. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని.. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.

Show comments