Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, పీకే-బాబు సమావేశం జరిగిందో లేదో.. అప్పుడే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి.. ఈ భేటీపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడు.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా, ఎంతమంది పవన్ కల్యాణ్‌లు కట్ట కట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు.
Read Also: Fire Accident: అంకుర్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు
బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తాడు.. గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశాడని గుర్తుచేసిన అంబటి.. ఈ రోజు లోకేష్ ని కలిశారని తెలిసింది.. గతంలో ప్రశాంత్ కిషోర్‌పై టీడీపీ చేసిన వ్యాఖ్యలు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండి అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. ఆ పీకే వచ్చినా, ఈ పీకే వచ్చినా.. టీడీపీ బ్రతకడం అసాధ్యం అని స్పష్టం చేశారు. ఇక, మెటీరియల్ బాగలేకపోతే మేస్త్రి వచ్చినా ఏం చేస్తాడు..? అని ప్రశ్నించారు. టీడీపీ మెటీరియల్ సరిగా లేదు, టీడీపీ కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోవాలని సూచించారు అంబటి రాంబాబు.
Read Also: Prashant Kishor meets Chandrababu: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..
ప్రశాంత్ కిషోర్ చనిపోయిన తెలుగుదేశం పార్టీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు, ప్రాణం పోయడానికి పనికిరాడు అని పేర్కొన్నారు అంబటి.. గతంలో ఉన్న రాబిన్ శర్మ పని అయిపోయిందా.. అందుకే కొత్త వ్యూ కర్తను తెచ్చుకున్నారా..? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఎక్కడికి పారిపోయాడు..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.