NTV Telugu Site icon

Ambati Rambabu: ఇక్కడున్నది కాపు బిడ్డ.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్

Main

Main

Ambati Rambabu: ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘X’ వేదికగా ఆయన మండిపడ్డారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ భయపెడితే తాను భయపడే రకం కాదని ఇందులోను మరీ స్పెషల్ గా తాను కాపు బిడ్డనంటూ చెప్పుకుంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేసిన విషయం తెలిసిందే.

వర్షాకాల సమావేశాల మొదటిరోజు వైసీపీ, టీడీపీ మధ్య సభలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. బీఏసీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరిగింది. దీంతో బాలకృష్ణ మీసం మెలేసి సవాల్ చేయగా, మంత్రి అంబటి అప్పుడే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారని.. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని అంబటి హెచ్చరించారు. ఈ మీసాలు తిప్పడం సినిమాల్లో చేసుకోవాలన్నారు. దీంతో స‌భ‌లో ఒక‌సారిగా ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Read Also: R.Ashwin: అశ్విన్కు వన్డేలలో ఛాన్స్ రాకపోవడానికి కారణమదే..!