Tamannaah Bhatia: మహిళా బిల్లు ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన మిల్కీ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Bhatia: నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. ఇక వారందరిలో తమన్నా హైలైట్ గా నిలిచింది. రెడ్ కలర్ చీరలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపించింది. పార్లమెంట్ భవనం సందర్శనానంతరం ఆమె మహిళా బిల్లు ఆమోదంపై హర్షం వక్తం చేసింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు గురువారం రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టడం, ఆ తరువాత చర్చలు జరగడం.. చివరకు ఆ బిల్లుకు ఆమోదం తెలపడంతో అందరు హర్షం వ్యక్తం చేశారు.
Bigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?
Also Read
- Nasha Mukth Bharath : డ్రగ్స్ మహమ్మారిపై ‘బాహుబలి’ యుద్ధభేరి
- Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
- Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
- Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
ఇక దీనిపై తమన్నా మాట్లాడుతూ.. ” ఈరోజు చారిత్రాత్మకమైన రోజు, పార్లమెంటు కార్యక్రమాలను చూసే అవకాశం మాకు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా ముఖ్యమైనది, మహిళలు ఇతర రంగాలలో సాధించగలిగితే, వారు దేశాన్ని కూడా నడిపించగలరు, ఈ బిల్లు మనకు ఒక మైలురాయి” అని తెలిపింది. అంతేకాకుండా ఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమన్నాతో పాటు దివ్యదత్తా కూడా మహిళా బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసారు.
తాజావార్తలు
-
Supreme Court: మేనరిక వివాహాలపై సుప్రీం నోటీసులు.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్..
-
Nepal PM Balen Shah: సంప్రదాయానికి భిన్నంగా నేపాల్ ప్రధాని అడుగులు.. మోదీ, ముర్ములకు అరుదైన చారిత్రక బహుమతులు!
-
Gold Rates Down: బంగారం ధరలు భారీగా పతనం.. మోడీకి థాంక్స్ చెప్పిన సీటీఐ..
-
Nasha Mukth Bharath : డ్రగ్స్ మహమ్మారిపై ‘బాహుబలి’ యుద్ధభేరి
-
Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!