ఏపీలో గత కొన్ని రోజులుగా రాజకీయం వేడెక్కింది. విశాఖ గర్జన తరువాత చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మొదలు ఇప్పటివరకు వరుసగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే.. నిన్న గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇళ్లను కూల్చివేశారని, తన సభకు స్థలం ఇచ్చిన వారిని టార్గెట్ చేసి ఇళ్లను కూల్చేశారంటూ పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే నేడు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించి వైసీపీ ప్రభుత్వంపై తారాస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా దూషణ చేశారన్నారు.
Also Read : Arjun Sarja: టాలీవుడ్ అంటే పద్దతి.. అది లేకపోతే ఇంట్లో కూర్చో.. విశ్వక్ పై అర్జున్ సీరియస్
ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య చూస్తే అతనిలో ఎంత ఫ్రస్టేషన్ ఉందో అర్ధం అవుతుందని, ప్రభుత్వాలను కూల్చే అవకాశం, హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూల్చేయటానికి ప్రభుత్వం అంటే ఏమైనా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా?? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 ఇళ్ళను కూల్చేశారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ అవాస్తవమని, రోడ్డు వైడనింగ్ కోసం జనవరిలోనే మార్కింగ్ చేశారని, పవన్ కళ్యాణ్ సభ జరిగింది మార్చి నెలలో అన్న మంత్రి అంబటి.. రోడ్డుకు మరోవైపు గతంలోనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయన్నారు.
Also Read : ‘Korameenu’ Teaser: మీసాలు కోల్పోయిన మీసాల రాజు కథ!
ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేనట్లు ఉందని, ఒక్క ఇల్లు కూడా పడగొట్ట లేదు.. .నేను సవాలు విసురుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. డ్రైన్ కట్టే క్రమంలో ఆక్రమణలను తొలగించారని, ఇక్కడే జరిగిందా?? ఎక్కడా జరగలేదా?? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను అంతమొందించటానికి 250 కోట్ల సుపారీ ఇచ్చారట… గుజరాత్‌కు చెందిన వాళ్ళకు 250 కోట్లు ఇవ్వటం ఎందుకు… దానిలో సగం డబ్బులు పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు ..తోక ఆడించుకుంటూ వస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పై ఓ రాయితో హత్య ప్రయత్నం అని డ్రామాలు ఆడుతున్నాడని, పవన్ కళ్యాణ్ డైలాగులు చూస్తే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేయకండి … పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్‌కు నా సలహా ఇది అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది అని, యువత జాగ్రత్తగా ఉండాలి అని, ఇప్పటం గ్రామంలో 50 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.