Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు. మూడు నెలల క్రితం అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఇక ఆ సినిమా షూటింగ్ కు విశ్వక్ వెళ్లకుండా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడని అర్జున్ ఆవేదన వ్యక్తం చేసాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అర్జున్ మాట్లాడుతూ ” కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తెలీదు. నా కూతుర్ని తెలుగు ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది.. రెండున్నర గంటలు కథ విని చాలా బావుంది మనం చేస్తున్నామని చెప్పాడు. తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది.
ఇక మొత్తం క్యాస్ట్ అంతా సెట్ చేసుకున్నాకా కేరళలో షూటింగ్ మొదలుపెట్టాం .. అప్పుడు విశ్వక్ తన మేనేజర్ తో పాటు వచ్చి నాకు కొంత టైమ్ కావాలి అన్నాడు. నేను హీరోనే నాకు తెలుసు.. ఎన్ని రోజులు అన్నాను. లేదు.. సినిమా కోసం బాడీ అంతా మార్చాలి. కొద్దిగా టైమ్ పట్టేలా ఉంది అని అడిగాడు. సరే సినిమా కోసమే కదా ఇదంతా అని ఆ షెడ్యూల్ ని కాన్సిల్ చేసాము. ఆ తరువాత నేను అతనికి చాలా సార్లు కాల్ చేసాను కానీ అతను పట్టించుకోలేదు. నా జీవితాల్లో అన్ని కాల్స్ ఎవరికి చేయలేదు. మొన్న వచ్చాడు నా దగ్గరకు అప్పుడు మళ్ళీ కథ చెప్పను..సూపర్ అన్నాడు. మళ్లీ షూట్ పెట్టుకుందాం అన్నాడు. నేను నమ్మాను.. 3వ తారీఖు షూట్ పెట్టుకున్నాను. 2 వ తేదీ నైట్ వరకు టచ్ లో ఉన్నాడు. ఈరోజు షూట్ అనగా మార్నింగ్ మెసేజ్ చేసాడు నేను రావడం లేదు నాకు టైం కావాలి అని చెప్పాడు.
కథ నచ్చింది ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన విశ్వక్ సేన్ కి ఇంకా ఏమి నచ్చలేదు అంటే.. బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ విశ్వక్ కి నచ్చడం లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్ర బోస్ లిరిక్స్ అతనికి ఇష్టం లేదు. నాకు మొదటి నుంచి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇస్తాడు. అయితే కేజీఫ్ రవి బాసుర్ నికుడా హైప్ కోసం పెట్టుకున్నాము..ఫైనల్ గా రవి ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు సెట్ కాదు అని అనూప్ నే తీసుకున్నాను. మాకు డిఫరెన్స్స్ ఉన్నాయి అని ఇప్పుడు తెలిసింది.. ముందే తెలిసి వుంటే అప్పుడే సినిమాని ఆపేసేవాడిని. ఇలా ఇంకొకరికి జరగ కూడదు అని మీడియా సమావేశం పెట్టాను. సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు వాళ్లకు ఏమి తక్కువ.. మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో వుంది. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. నేను ఇలాంటి వాతావరణంలో సినిమా చెయ్యడం లేదు అని చెపుతున్నాను. టాలీవుడ్ అంటే ఒక పద్దతి వుంటుంది అందరూ ఆ పద్ధతి నీ పాటించాలి. కుదరదు అంటే ఇంట్లో కూర్చోవాలి. ఈ విషయం అందరికి తెలియాలనే ప్రెస్ మీట్ పెట్టాను. త్వరలోనే మరో హీరోతో మరో సినిమా స్టార్ట్ చేస్తాను. ఏది జరిగినా లైఫ్ అయితే ఆగదు కదా” అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.