MI vs DC: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరో..? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్..!
- మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్..
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
- డీసీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్..
- రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్షర్ పటేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs DC: నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ ను మొదటగా బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆడటం లేదు. అతని స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ కోసం వచ్చాడు. ఈ మ్యాచ్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’ లాంటిది. ప్లేఆఫ్స్‌కు నాల్గవ స్థానం కోసం ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరుగుతోంది. నేడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు గెలిస్తే వారు ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.
Read Also: Barley Chia Water: చియా గింజలను నీటిలో నానబెట్టి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
మరోవైపు, అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే వారి మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వారి చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే, నేడు జరిగే మ్యాచ్ పై కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణం విలన్‌గా మారితే, ముంబై అదృష్టంపై ఆధారపడి ఉండాలి. కానీ, ఢిల్లీకి మాత్రం టెన్షన్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వారి చివరి మ్యాచ్ గెలిచి, ముంబై ఓటమి కోసం ప్రార్థించవలసి ఉంటుంది. రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడాలి. పంజాబ్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. ఇక నేటి మ్యాచ్ ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!