MI vs DC:ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, ముంబై బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేశారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ (5) త్వరగా ఔట్ అయినప్పటికీ, రయాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మెరుపులాంటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతనికి చివర్లో నామన్ ధీర్ (8 బంతుల్లో 24 పరుగులు) మంచి సహజరం అందించాడు.
Read Also: IndiGo Flight: గాల్లో ఇండిగో విమానంపై పిడుగు.. వీడియో వైరల్
ముంబై చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేయడంతో తమ స్కోరును 180కి చేర్చగలిగింది. తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (3) విఫలమైనప్పటికీ చివర్లో సూర్యకుమార్, నామన్ ధీర్ జోడి మెరుపు ప్రదర్శనతో మంచి స్కోర్ ను చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఇక బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ముఖేష్ కుమార్ 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. చమీరా, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ విజయం సాధించాలంటే బౌలర్లదే కీలకపాత్ర. చూడాలి మరి ఏ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ చేరుకుంటుందో.
Read Also: YS Jagan: కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం!