ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్లు 16 ఓవర్లు ఆడనున్నాయి.
కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ముంబై ప్లేయింగ్ ఎలెవన్:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.