NTV Telugu Site icon

SA20 2025: SA20 లీగ్ కొత్త ఛాంపియన్‭గా MI కేప్ టౌన్

Sa20

Sa20

SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్‌ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో మంచి ప్రదర్శన ఇచ్చింది. దీనితో MI కేప్ టౌన్ మొదటిసారి విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ కు మూడోసారి కప్ గెలవాలన్న కోరికకు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో నిరాశ ఎదురైంది. సన్ రైజర్స్ ను MI కేప్‌టౌన్‌ దెబ్బకొట్టింది. 182 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ కేవలం ​18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయం తర్వాత MI కేప్ టౌన్ జట్టుకు 34 మిలియన్ ర్యాండ్లు (సుమారు 16.2 కోట్ల రూపాయలు) గ్రాండ్ ప్రైజ్‌ మనీ గెలుచుకుంది. ఫైనల్‌లో ఓడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు 16.25 మిలియన్ ర్యాండ్లు (సుమారు 7.75 కోట్ల రూపాయలు) దక్కాయి. అదేవిధంగా సీజన్లో మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు. మూడవ స్థానంలో ఉన్న జట్టుకు 4.24 కోట్ల రూపాయలు అందగా, నాల్గవ స్థానంలో ఉన్న జట్టుకు 3.74 కోట్ల రూపాయలు అందాయి.

Read Also: Mufasa: OTT లోకి వచ్చేస్తున్న ‘ముఫాసా:ది లయన్ కింగ్’ .

SA20 2025 లో MI కేప్ టౌన్ జట్టు విజయం, MI ఫ్రాంచైజీకి మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఎందుకంటే, MI ఫ్రాంచైజీ మొత్తం నాలుగు లీగ్లలో (ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, SA20) పాల్గొంటూ ప్రతి లీగ్లో కనీసం ఒకసారి ఛాంపియన్‌గా నిలిచింది. MI ఫ్రాంచైజీకి టీ20 లీగ్‌లో ఇది 11వ ఛాంపియన్‌షిప్. ఐపీఎల్‌లో 2013, 2015, 2017, 2019, 2020లో విజయం సాధించింది. అలాగే, ఛాంపియన్స్ లీగ్ 20లో 2011, 2013లో విజయం సాధించింది. 2023లో MI ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మెజర్ లీగ్ క్రికెట్‌లో విజయం సాధించింది. 2024లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 కూడా విజయం సాధించిన తరువాత, ఇప్పుడు SA20లో కూడా విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయంతో, MI ఫ్రాంచైజీ క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి మరింత దూకుడుగా ఎదుగుతోంది.