హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొని సౌత్ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో ‘సూపర్ మేన్’, ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘ఫ్రోజోన్’ వంటి పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో వచ్చిన సినిమానే ‘ముఫాసా:ది లయన్ కింగ్’. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన, ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం.. గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద స్టోరీని సింహాలకు అన్వయిస్తూ తెరపై చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు. సినిమా చూస్తునంత సేపు తెరపై నిజంగా సింహాలు, జంతువులు కదలాడుతున్నట్టే అనిపించాయి. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనే ఫీల్ రాలేదు.కథ మొదలవగానే ప్రేక్షకులను ఆ లోకంలోకి తీసుకెళ్లాడు.
Also Read:Raviteja: ఆ క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమా..!
ఇక పలు భాషల్లో రూపొందిన ఈ సినిమాకు, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ముఫాసా’ సింహం పాత్రకు తన గాత్రాన్ని అందించారు. ఇది మరో ప్రధాన ఆకర్షణగా మరించిది. ఇక 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’కు ప్రీక్వెల్గా వచ్చిన ఈ ‘ముఫాసా’ మూవీలో, అసలు రాజు గా ఎలా మారాడు? ఆయన గత చరిత్ర ఏంటి? అనే అంశాలను, సూచించిన విధానం ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఇక మంచి కలెక్షన్‌లతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 18 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ టీం.