SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో…
Chiranjeevi: యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి షార్జా స్టేడియంలో నిన్న (జనవరి 17) దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆయన వీక్షించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉందని వివరణ ఇచ్చాడు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఐఎల్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. గతంలోనూ ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.