MG Windsor Pro: ఎంజీ మోటార్ ఇండియా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ఇందులో భాగంగానే నేడు (మే 6)న కొత్త ఎమ్‌జీ విండ్సర్ ప్రో ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే పాపులర్ అయినా విండ్సర్ మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా నిలుస్తోంది. కొత్త విండ్సర్ ప్రో ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.
Read Also: World Asthma Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఆస్తమా కావచ్చు.. జాగ్రత్త సుమీ!
గత ఏడాది ప్రారంభమైన విండ్సర్ ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. కేవలం ఏడాదిలోపే 20 వేలకు పైగా అమ్ముడవడంతో వినియోగదారుల మనుసులు గెలుచుకుంది. ఈ విజయానికి కొనసాగింపుగా విండ్సర్ ప్రో ను పరిచయం చేశారు. ఇక ఈ కారు మెరుగైన మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త ప్రమాణాలను అదించబోతుంది. విండ్సర్ ప్రోలో ప్రధాన అప్‌గ్రేడ్ గా 52.9kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీగా చెప్పవచ్చు. ఈ బ్యాటరీ ఒకసారి పూర్తిగా చార్జ్ చేయగానే 449 కీ.మీ. ప్రయాణ దూరాన్ని అందించగలదు. గత విండ్సర్ మోడల్‌కి 38kWh బ్యాటరీ మాత్రమే ఉండేది. దానితో కేవలం 332 కీ.మీ. (ARAI) రేంజ్‌ను అందించింది.
Read Also: Minister Savitha: చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటిది..
విండ్సర్ ప్రో లో మరొక ప్రధాన ఆకర్షణగా ఆడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు అందించనున్నారు. ఇందులో లెవల్ 2 ADASలు 12 ఫీచర్లు కలిగి ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్ లాంటి మొదలైన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అయితే డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త అలాయ్ వీల్ డిజైన్లు, అప్‌డేటెడ్ అప్హోల్స్టరీతో తేలికపాటి లుక్ ను ఇచ్చారు. ఇప్పటికే విండ్సర్ మోడల్‌లో ఉన్న 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎల్ఈడి లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎయిరో లౌంజ్ సీట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లపై విండ్సర్ ప్రో మరింత అప్డేట్ చేయబడింది.
ఇకపోతే బ్యాటరీను అద్దెకు తీసుకునే BaaS (Battery as a Service) ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే.. కస్టమర్లు కారును కేవలం రూ. 12.50 లక్షలకే పొందవచ్చు. అద్దె బ్యాటరీ రూ. 4.5/కిమీగా ధర నిర్ణయించారు. విండ్సర్ ప్రో కొనుగోలుదారులకు 3 సంవత్సరాలు లేదా పరిమిత కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్డు సాయం, అలాగే 3 సంవత్సరాల తర్వాత 60% బైబ్యాక్ విలువ కూడా హామీగా ఇవ్వబడుతుంది. ఇది వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించేలా నిలుస్తోంది. చూడాలి మరి ఎమ్‌జీ విండ్సర్ ప్రో వినియోగదారులను ఆకట్టుకోగలదో.