World Asthma Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఆస్తమా కావచ్చు.. జాగ్రత్త సుమీ!
- ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే
- ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Asthma Day 2025: ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే (World Asthma Day) పాటించబడుతుంది. ఈ సంవత్సరం ఇది మే 6, 2025 న జరుగుతోంది. ఇక ఈ రోజు ముఖ్య ఉద్దేశం, ఆస్తమా బాధితులను ఆరోగ్యంగా జీవించేందుకు ప్రేరేపించడం, వ్యాధి భారం తగ్గించేందుకు అవసరమైన సమాచారంతో పాటు మద్దతును అందించడం. అయితే అసలు ఆస్తమా వ్యాధి కలగడానికి గల ముఖ్యమైన లక్షణాలను చూద్దాం.
Read Also: Minister Kondapalli and MLA Ganta: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటాకు తప్పిన ప్రమాదం
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
అలర్జీలు (Allergies):
కొంతమంది శరీరాలలో ఇతరుల కంటే ఎక్కువగా అలర్జీ ప్రతిచర్యలు కనిపిస్తాయి. ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బూదిద వంటి వాటికి అలర్జీ ఏర్పడడం వల్ల ఆస్తమా రావడానికి కారణమవుతుంది.
ధూమపానం (Smoking):
సిగరెట్ పొగ శ్వాసనాళాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ధూమపానం చేసే వారికి ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ. గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేస్తే, ఆ శిశువుకి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వైరల్ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు:
చిన్నపుడే వైరల్ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు గురైన కొందరు పిల్లల్లో పెద్దయ్యాక దీర్ఘకాలిక ఆస్తమా అభివృద్ధి చెందవచ్చు.
Read Also: Kollywood : ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నలుగురు టాప్ కమెడియన్స్
కుటుంబ చరిత్ర:
ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే, మీకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాయు కాలుష్యం:
దుమ్ము, ధూళి వాతావరణంలో ఎక్కువగా గడిపే వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక ఆస్తమా హెచ్చరిక ilలక్షణాలు తేలికగా తీసుకోకండి!
అలాగే శ్వాస తీయడంలో ఇబ్బంది లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, ఇంకా ఇన్ హేలర్ వాడినా కూడా మెరుగుదల కనిపించకపోవడం లాంటి లక్షణాలు కనిపించిన అవి ఆస్తమా లక్షణాలు కావచ్చు. అలాగే శారీరక శ్రమ లేకుండానే శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బంది, ఛాతీ దగ్గర ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అధికంగా చెమట రావడం.. అలాగే ముఖం, పెదవులు నీలంగా మారడం లక్షణాలు కలిగి ఉన్న అవి ఆస్తమా లక్షణాలే.
తాజావార్తలు
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!