ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్‌సోర్’ ధరలను పెంచింది. విండ్‌సోర్ అన్ని వేరియంట్‌లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్‌సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్‌సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్‌లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో…
MG Windsor EV Price in India: భారత ఆటో మార్కెట్లో ‘ఎంజీ విండ్‌సోర్ ఈవీ’ లాంచ్ అయింది. ఇది ఎంజీ నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే భారత మార్కెట్లో జెడ్‌ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను ఎంజీ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. విండ్‌సోర్ ఈవీ ధర రూ.9.99 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి మొదలవుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్‌లు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఇక అక్టోబర్ 12 నుండి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.…