Mexico Gen Z Protests: జనరల్-జెడ్.. నేపాల్‌ను అతలాకుతలం చేసిన పేరు. ఇప్పుడు ఈ జనరల్ జెడ్ మెక్సికో వరకు పాకింది. ఇప్పుడు మెక్సికోలో జనరల్-జెడ్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి మెక్సికో అంతటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో వివిధ వయసుల వారు పాల్గొన్నారు, వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన…