Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Mexican Navy Training Ship Cuauhtemoc Crashes Into Brooklyn Bridge 2 Dead 19 Injured

Cuauhtemoc: బ్రిడ్జ్‌ను ఢీకొన్న నేవీ ట్రైనింగ్ షిప్.. ఇద్దరు మృతి, 19 మంది గాయాలు..!

Published Date :May 18, 2025 , 1:42 pm
By Kothuru Ram Kumar
Cuauhtemoc: బ్రిడ్జ్‌ను ఢీకొన్న నేవీ ట్రైనింగ్ షిప్.. ఇద్దరు మృతి, 19 మంది గాయాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cuauhtemoc: అమెరికా న్యూయార్క్ నగరంలో శనివారం రాత్రి ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. మెక్సికో నేవీకి చెందిన ట్రైనింగ్ షిప్ కౌటెమోక్ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొని రెండు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో మరో 19 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇక న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శనివారం రాత్రి 8:20 గంటల సమయంలో జరిగింది. షిప్ కెప్టెన్ నౌకను నియంత్రిస్తూ ఉండగా పవర్ కోల్పోవడంతో నౌక అనుకోకుండా బ్రూక్లిన్ బ్రిడ్జ్ వైపు వెళ్లింది. దానితో అది బ్రిడ్జ్ అడుగు భాగంలో ఉన్న అభట్‌మెంట్‌ను ఢీకొంది.

Read Also: IMF: పాకిస్తాన్‌కు IMF షాక్.. కొత్తగా మరో 11 షరతులు..!

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

ఈ కౌటెమోక్ నౌక 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగి ఉంది. దీనిలో మూడు భారీగా ఉన్న దండాలు ఉన్నాయి. అయితే, బ్రూక్లిన్ బ్రిడ్జ్ మద్యభాగంలో ఉన్న గరిష్ఠ క్లియరెన్స్ 135 అడుగులు మాత్రమే. నౌక మస్తుల పొడవు 147 అడుగులు కావడంతో ఇవి బ్రిడ్జ్‌ను ఢీకొట్టి విరిగిపోయాయి. ఈ సమయంలో నౌకపై ఉన్న నావికుల్లో పలువురు పైభాగంలో ఉండగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నౌక 1982లో ప్రారంభమై ప్రతి సంవత్సరం మెక్సికన్ నావల్ మిలటరీ స్కూల్ క్యాడెట్ల తుది శిక్షణ ప్రయాణానికి ఉపయోగించబడుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ నౌక ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్టు నుంచి బయలుదేరి ఐస్‌లాండ్‌కు చేరే లక్ష్యంతో సాగుతోంది. న్యూయార్క్‌లో మంగళవారం నుంచి నౌక డాక్ వద్ద నిలిచింది. శనివారం నాడు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన జనం మధ్య నౌక నగరం విడిచి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Read Also: Abhishek-Aishwarya Rai: పెళ్లి వేడుకలో కూతురితో కలిసి రచ్చరచ్చ చేసిన బచ్చన్ దంపతులు..!

ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కౌటెమోక్ నౌకలోని ఇద్దరు సిబ్బంది మృతిపై మేము ఎంతో విచారిస్తున్నాం అని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో ఇటీవల జరిగిన రెండో పెద్ద షిప్-బ్రిడ్జ్ ప్రమాదం. 2024 మార్చిలో బాల్టిమోర్‌లో ఓ భారీ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొనడంతో అది కూలిపోయి ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

https://twitter.com/GeneGreen344103/status/1923992632843436307

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brooklyn Bridge accident
  • Cuauhtemoc ship
  • Mexico Navy
  • naval training vessel
  • New York ship collision

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions