Ponnam Prabhakar : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా గర్వభావాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. “జై హింద్!” అంటూ ప్రారంభించిన ఆయన ప్రకటనలో, సాయుధ దళాల విజయంపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశ సరిహద్దుల్లో సైన్యం చూపిన ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని, నగరంలోని పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భద్రత చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
Star Hero : ఓ వైపు ప్లాపులు.. అయినా సరే భారీ రెమ్యునరేషన్
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా, వెంటనే సమీప పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి” అని కోరారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్‌నగర్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్లులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాతాళ్ళలో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా నగరాన్ని రక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారతదేశం అంతర్భాగంలో కానీ, సరిహద్దుల్లో కానీ మనం ఎప్పుడూ గెలవాలని, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ తీర్మానించినట్లు తెలిపారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. చివరగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.