Mercedes-Benz: సింగిల్ ఛార్జింగ్‌పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్ బెంజ్’!
- గిన్నిస్ రికార్డుల్లో మెర్సిడెస్ బెంజ్
- ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ రికార్డు బద్దలు
- బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్’ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్ చార్జ్‌తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు తేల్చాయి.
మార్గ మధ్యంలో వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్ ఈ రికార్డు సాధించడం విశేషం. బెంగళూరు నుంచి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరింది. ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్‌ను ఈ కారు వినియోగించుకుంది. ‘ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ’ కారు నెలకొల్పిన రికార్డును మెర్సిడెస్ బెంజ్ బద్దలు కొట్టింది. యూకేలో ఆ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 916.74 కిమీ ప్రయాణించింది.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
Also Read: Ganesh Chaturthi 2024: ఆ గ్రామంలో ‘ఒక్కడే’ వినాయకుడు.. 40 ఏళ్లుగా ఆనవాయితీ! కారణం ఏంటంటే
‘మేడ్ ఇన్ ఇండియా’ ఈక్యూఎస్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను గెల్చుకోవడం పట్ల మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించడానికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న చకాన్ ప్లాంట్‌లో ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!