Menstrual Problems: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తున్నా రుతుక్రమం విషయానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి చాలామంది ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరు. దీని వల్ల అనారోగ్య సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆడవారికి రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం పెద్ద సమస్యే అని చెప్పవచ్చు. ఈ సమస్యను పక్కవారితో చర్చించి ఏదైనా మార్గం ఆలోచించే ప్రయతనం కూడా చేయరు. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకసారి చూద్దామా..
రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ సమస్యతోపాటు కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఉండటాన్ని “మెనోరేజియా” లేదా “హెవీ పీరియడ్స్”గా పిలుస్తారు. అయితే ఇవి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. నెలసరి సమయంలో 80ml కంటే ఎక్కువ బ్లీడ్ అయినప్పుడు మెనోరేజియాగా పిలుస్తారు. ఈ పరిస్థితిని కొన్ని అంశాల ద్వారా మహిళలు గుర్తించొచ్చు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికీ రక్తం గడ్డలుగా విడుదల అవ్వడం, అతి తక్కువ సమయానికే ప్యాడ్లు మార్చల్సి రావడం అలాగే మందులు వేసుకున్నా కడుపు నొప్పి తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. గర్భాశయ సమస్యలు, జీవక్రియ రేటు, ఇంకా హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరిగే ప్రమాదం ఉంటుంది.
రుతుక్రమం దగ్గర పడేటప్పుడు కొందరి మహిళల్లో ఈ బ్లీడింగ్ సమస్య ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భాశయంలో కణితులు ఏర్పడడం, హర్మోన్లలో మార్పులు లాంటి సమస్యల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడినప్పుడు కూడా ఈ సమస్య కలగవచ్చు. ఇంకా రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు కూడా హెవీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకిన సమయంలో కూడా ఈ బ్లీడింగ్ సమస్య ఎక్కువ కావొచ్చు. ఇక ఈ సమస్యను కొద్దిమేర తగ్గించుకునేందుకు ఐరన్ పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు వంటి ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాదు, ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలని వారు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే, ఎలాంటి మందులు అవసరమో వైద్యులు మాత్రమే సూచించగలరు. అందుకు తగ్గట్లుగానే మందులు వేసుకోవడం మంచిది.