Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Members Of Telangana Education Commission Chairman Met Deputy Cm Bhatti Vikramarka

Hyderabad: డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు..

Published Date :February 18, 2025 , 8:37 pm
By Rajesh Veeramalla
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు
  • రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను..,
  • తయారు చేసి భట్టి విక్రమార్కకు ఇచ్చిన విద్యా కమిషన్.
Hyderabad: డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని.. దీని ఫలితంగా అభ్యాస పేదరికం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా రంగం దుస్థితి వలన ప్రజా, పౌర సమాజ సంస్థల నుండి ఒత్తిడి, అశాంతి పెరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.

Read Also: Kiss: ముద్దంటే పడని అబ్బాయి ఉంటాడా అసలు?

2025-26 సంవత్సరములో విద్యారంగానికి బడ్జెట్‌ను పెంచాలని.. ప్రభుత్వం తగిన జోక్యం చేసుకోవాలని విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో రాష్ట్ర బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రూపొందించగల అభివృద్ధి ప్రాధాన్యతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు.

Read Also: JNTUH: జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ..

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్ది.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్ ను తయారుచేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విద్య కమిషన్ ఛైర్మన్ సభ్యులు అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్ గ్రేడ్ చేసి.. అంతర్జాతీయ ప్రమాణాలు, ఉత్తమ అభ్యాస వాతావరణం, ఉత్తమ బోధనా వాతావరణంతో కూడిన ఉత్తమ పాఠశాల ప్రమాణాలు కలిగి ఉండేటట్లుగా బడ్జెట్ తయారుచేసి ప్రభుత్వానికి అందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deputy CM Bhatti Vikramarka
  • Education Commission
  • telangana education
  • telangana government
  • telangana news

తాజావార్తలు

  • TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్‌.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?

  • Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!

  • US China Tensions: షాకింగ్.. చైనా, అమెరికా మధ్య సముద్ర ఘర్షణలు.. నలిగిపోతున్న ఈ చిన్న దేశం!

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • Most Expensive Diamonds: కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం! ధర ఎంతో తెలుసా

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions