Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melania Trump: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై ఆమె స్పందించారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు వస్తున్న ఆరోపణలను ఖండించారు. వైట్ హౌస్ వేదికగా ప్రసంగిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్‌స్టీన్‌తో తనను ముడిపెడుతూ వస్తున్న వార్తలకు ఇకనైనా ముగింపు పలకాలని, తనపై అసత్యాలు ప్రచారం చేసే వారికి కనీస నైతిక విలువలు లేవని ఆమె ఘాటుగా విమర్శించారు. తనకు, ఎప్‌స్టీన్కు మధ్య ఎప్పుడూ స్నేహం లేదని మెలానియా పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ హాజరయ్యే పార్టీలకు తనను, డొనాల్డ్ ట్రంప్‌ను అప్పుడప్పుడు ఆహ్వానించేవారని అంగీకరించారు. అలాంటి పెద్ద సర్కిల్స్‌లో ఒకే చోట కలవడం సహజమే తప్ప, అది సాన్నిహిత్యం కాదని నొక్కి చెప్పారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఇక ఎప్‌స్టీన్ ప్రధాన అనుచరురాలు ఘిస్లేన్ మాక్స్‌వెల్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలను సైతం తోసిపుచ్చారు. గతంలో తాను మాక్స్‌వెల్ ఈమెయిల్‌కు పంపిన సమాధానం కేవలం మర్యాదపూర్వకమైన సందేశం (కాజువల్ కరస్పాండెన్స్) మాత్రమేనని, అంతకు మించి వారి మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌ను తనకు ఎప్‌స్టీన్ పరిచయం చేశాడన్న వార్తలను మెలానియా కొట్టిపారేశారు. 1998లో న్యూయార్క్‌లో జరిగిన ఒక పార్టీలో తాను ట్రంప్‌ను కలిశానని, ఆ వివరాలన్నీ తన పుస్తకం ‘మెలానియా’లో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఎప్‌స్టీన్‌ను తాను మొదటిసారి 2000వ సంవత్సరంలో కలిశానని, అప్పట్లో అతని నేర చరిత్ర గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. తాను ఎప్‌స్టీన్ బాధితురాలిని కాదని, అతని నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం అతని ప్రైవేట్ జెట్ లేదా ఐలాండ్‌కు కూడా తాను ఎప్పుడూ వెళ్లలేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలని మెలానియా ఆకాంక్షించారు. బాధితులైన ప్రతి మహిళకు బహిరంగంగా తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ఇవ్వాలని, వారి వాంగ్మూలాలను కాంగ్రెషనల్ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!