Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh 6 Sixes Story: టీ20 ప్రపంచకప్ 2007ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సీజన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది యువరాజ్ సింగ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టీ20 అంతర్జాతీయ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు. యువరాజ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ.. బ్రాడ్ పరిస్థితి దిగజారింది. ఆ ఎదురుదెబ్బ నుంచి కోలుకోవడానికి ఆ ఇంగ్లాండ్ పేసర్ చాలా కృషి చేశాడు. ఎన్నో కష్టాలను అధిగమించి చివరికి ఇంగ్లాండ్ ఆధునిక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అయితే, ఆ మ్యాచ్ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను యువీ ఇటీవల మైఖేల్ వాన్ షో ‘ది ఓవర్ లాప్’లో పంచుకున్నాడు. ఆ సిక్సర్ల వర్షం కురిసిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, మ్యాచ్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్ తన వద్దకు వచ్చారని యువీ గుర్తు చేసుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
“నువ్వు దాదాపు నా కొడుకు కెరీర్‌ను ముగించేశావు” అని క్రిస్ బ్రాడ్ తనతో అన్నారని యువరాజ్ వెల్లడించాడు. “సర్, నా బౌలింగ్‌లో కూడా ఒకప్పుడు ఐదు సిక్సర్లు పడ్డాయి, ఆ బాధ నాకు తెలుసు” అని ఆ తండ్రికి సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాదు.. క్రిస్ బ్రాడ్ ఒక జెర్సీపై సంతకం చేసి ఇవ్వమని యువరాజ్‌ను కోరాడట. “నా బౌలింగ్‌లో కూడా ఐదు సిక్సర్లు పడ్డాయి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతావని ఆశిస్తున్నాను” అని యువీ జెర్సీపై రాసి ఇచ్చాడట. అయితే, ఆ జెర్సీని స్టువర్ట్ బ్రాడ్ కోపంతో డస్ట్‌బిన్‌లో పడేశాడని యువీకి ఈ మధ్యే తెలిసింది. ఆ స్థాయిలో అవమానం జరిగినప్పుడు ఆ కోపం రావడం చాలా సహజమని, అది ఏమాత్రం తప్పు కాదని యువరాజ్ పేర్కొన్నాడు. ఆ దెబ్బతో కుంగిపోకుండా బ్రాడ్ 600 పైగా టెస్ట్ వికెట్లు తీసి లెజెండరీ బౌలర్‌గా ఎదగడం గొప్ప విషయమని కొనియాడాడు.
READ MORE: Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..