ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను పార్టీ చెప్పిన ప్రకారం జయమంగళ వెంకట రమణకే ఓటు వేశాను ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదు. నేను పార్టీకి చేసిన ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చాను. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదు. నియోజకవర్గంలో నేను ఏంటో చూపిస్తాను. జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి.
Read Also: Amritpal Singh: డెహ్రాడూన్, హరిద్వార్ హై అలర్ట్.. నేపాల్‌కు పారిపోయేందుకు ప్లాన్..
ఎవరో నా మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇదంతా మా పార్టీ నేతలే చేస్తున్నారు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకే ఓటేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మరి టీడీపీ అభ్యర్థికి ఓటేసింది ఎవరనేది తేలాల్చి ఉంది.
Read Also:Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?
వైసీపీ నేతలు మాత్రం పార్టీకి ద్రోహం చేసినవారి భరతం పడతామంటున్నారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వల్లభనేని మాట్లాడుతూ.. మా మాజీ బాస్ డబ్బులు చూపి కొనుగోలు చేయడంలో ఎక్స్ పర్ట్..డబ్బులు ఎర చూపి నలుగురిని కొనుగోలు చేసినట్లు తెలిసింది..అందువలనే టిడిపి గెలిచింది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనే చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నారు..దీంతో ఇద్దరికి మేలు జరిగింది.. చంద్రబాబు కు ఓటు వచ్చింది, వీరికి క్యాష్ వచ్చింది. మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని టిడిపి అంది ఇప్పుడు ఎపిలో 175 గెలుస్తామని చెబుతుంది, జరిగేవి చెప్పాలన్నారు వంశీ.