మెహ్రీన్ ఫిర్జాద.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బోల్తా కొట్టాయి.. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా శారీలో అదిరిపోయే పోజులున్న ఫోటోలను నెట్టింట పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా మెహ్రీన్ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరలో నైట్ ఫొటోషూట్ చేసి అదరగొట్టింది. బ్యూటీఫుల్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మెరిసిపోయే చర్మసౌందర్యంతో మంత్రముగ్ధులను చేసింది.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ హార్ట్ బీట్ పెంచింది. హనీ బేబీ స్టన్నింగ్ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఫిదా చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
అయితే ఎఫ్ 2 చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటుగా లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా షేర్ చేస్తూ వస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. మోహ్రీన్ ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ని పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు తమిళం బైలింగ్వుల్ ‘స్పార్క్’, కన్నడలో ‘నీ సిగూవరేగు’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కన్నడలో ఇదే తొలిచిత్రం కావడం విశేషం..