Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visvambhara : లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర”. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారీ ట్రీట్ టీజర్‌ను ఈ దసరా పండుగ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ వండర్ విశ్వంభర. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేశారు. మరి ఈరోజు విడుదలైన టీజర్ ఎలా ఉందో చూద్దాం.
టీజర్ స్టార్ కాగానే హలీవుడ్ మూవీ అవతార్ సినిమాలో మాదిరి రెక్కల పక్షులు కనిపిస్తాయి. వెంటనే ఆకాశం నుంచి ఓ రాక్షకుడు ఇక్కడికి వస్తాడు. వెంటనే విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా పుట్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది. అంటూ బ్యాగ్రౌండ్ డైలాగ్స్ వినిపిస్తాయి. తర్వాత ఓ పాప మిత్రా.. యుద్ధం వస్తందని అన్నావు కదా ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని ప్రశ్నిస్తుంది. తర్వాత రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఎంట్రీ అదిరి పోయిందనే చెప్పాలి. తర్వాత రాక్షకులకు యోధుడికి మధ్య జరిగే యుద్ధం కధాంశంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
టీజర్ చూస్తుంటే రాక్షసుల లోకం, మరో ప్రపంచం ఉన్నట్లు.. మెగాస్టార్ చిరంజీవికి దైవాంశ ఉన్నట్లు, దుష్టశక్తులను ఎదిరించినట్లు తెలుస్తుంది. టీజర్ లో మొత్తం గ్రాఫిక్స్ తోనే నిండిపోయింది. చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే షాట్ అదిరిపోయింది.ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా మరో అయిదుగురు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా వేయడంతో విశ్వంభర సినిమాని వాయిదా వేశారు. మీరు కూడా విశ్వంభర టీజర్ చూసేయండి.
Read Also:Telangana Auto Drivers: కొత్త ఆటోల కొనుగోలుకు ‘నో ఫర్మిట్’.. జీరో పొల్యూషన్‌పై రవాణా శాఖ దృష్టి..
Read Also:ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్ మేనేజర్ సంచలనం..
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!