మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ”విశ్వంభర” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ చిత్రాన్ని ”బింబిసార” ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు . సోషియో ఫాంటసీ మూవీగా ”విశ్వంభర” మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఓ భారీ సెట్లో ఈ మూవీకి సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించినట్లు సమాచారం.ఈ ఫైట్ సీన్ కోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని రూపొందించారని తెలుస్తుంది .యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణ లో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వస్తున్న ”విశ్వంభర” మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఈ సినిమాలో మెగా స్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.దాదాపు 18 ఏళ్ల తరువాత చిరంజీవి ,త్రిష కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .ఇదిలా ఉంటే ఎప్పుడు తన సినిమా గురించి లీక్స్ ఇచ్చే మెగా స్టార్ ”విశ్వంభర” చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు .ఈ మూవీలో తన లుక్ ఎలా వుండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశ్వంభర షూటింగ్ కి వచ్చినప్పుడు ఆచార్య లుక్ లో మెగాస్టార్ కనిపించారు .అలాగే యంగ్ హీరో కార్తికేయ తన కొత్త సినిమా ”భజే వాయువేగం”చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని కలిసారు.ఈ సందర్భంగా ”విశ్వంభర” అప్డేట్స్ అడుగగా చిరంజీవి దాని గురించి చెప్పలేదు .అయితే కార్తికేయను కలిసినప్పుడు మెగా స్టార్ లుక్ రౌడీ అల్లుడు లుక్ ను గుర్తు చేసింది .దీనితో ఈ సారి ఎలాంటి లీక్స్ ఇవ్వనంటూనే మెగాస్టార్ తన లుక్ ఫై బిగ్ లీక్ ఇచ్చేసారు .