పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ షూట్ చేసాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో రెబల్ స్టార్ త్వరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.
Also Read : The Raja Saab : థియేటర్ రన్ ముగించిన రాజాసాబ్.. ఫైనల్ గా నష్టం ఎంత?
కాగా ఈ సినిమాకు సంబందించి ఓ న్యూస్ టాలీవుడ్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “స్పిరిట్” సినిమాలో నటించబోతున్నాడు, యంగ్ రెబల్ స్టార్ కు తండ్రిగా సినిమా సెకండాఫ్ లో దాదాపు 15 నిమిషాల పాటు కనిపించబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి కలయిక పెద్ద సంచలనం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా మెగాస్టార్ చేతులు మీదుగా జరగడగంతో స్పిరిట్ లో మెగాస్టార్ నటిస్తున్నాడు అని గాసిప్ లకు బలం చేకూరింది. ఈ విషయమై స్పిరిట్ టీమ్ ను సంప్రదించగా కీలక విషయాలు తెలిశాయి. అసలు స్పిరిట్ లో మెగాస్టార్ నటిస్తున్నాడనేది ఫేక్ న్యూస్. అసలు ఆ దిశగా చర్చలు కూడా జరగలేదు. కొందరు కావాలని ఇలాంటి వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏదైనా ఉంటె తామే అధికారకంగా ప్రకటిస్తామని తెలిపారు.