టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.మెగా 156 గా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ అలాగే కాన్సెప్ట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విశ్వంభర టైటిల్ లుక్ లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా విశ్వంభార చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించి మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. యాక్షన్ మోడ్‌లోకి యూనివర్స్‌ను మించిన మెగా మాస్.. డైరెక్టర్ వశిష్ఠ, డీవోపీ చోటా కే నాయుడు విశ్వంభర కోసం పాపులర్ యాక్షన్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్‌తో ఫైట్ సీక్వెన్స్ కోసం యాక్షన్ కొరియోగ్రఫీ చర్చలు మొదలయ్యాయి.. అంటూ ఓ స్టిల్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
వశిష్ఠ కట్ చేసిన టైటిల్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోతో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది.. విశ్వంభర చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ మరియు ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు.ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తో ఆస్కార్ అవార్డ్ అందుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఇప్పటికే ఎంఎం కీరవాణి క్లారిటీ ఇచ్చేశారు. విశ్వంభర కాన్సెప్ట్ వీడియో లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట 5 మిలియన్లకుపైగా డిజిటల్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లో టాప్-10 బెస్ట్ మూవీస్ లో టాప్3 గా నిలుస్తుంది అని దర్శకుడు ఎంతో వశిష్ఠ కాన్ఫిడెన్స్‌తో చెప్పడంతో సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి..
MEGA MASS BEYOND UNIVERSE gets into action mode 🔮💥
Director @DirVassishta, DOP @NaiduChota have begun the Action Choreography discussions with renowned action directors #RamLakshman masters for the fight sequences of #Vishwambhara 💥💥
MEGASTAR @KChiruTweets @mmkeeravaani… pic.twitter.com/HL77j9I1TI
— UV Creations (@UV_Creations) January 30, 2024