Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా మీద రోజురోజుకు హైప్ పెరిగిపోతుంది. ప్రస్తుతం పుష్ప2 గురించి దేశం అంతా చర్చించుకుంటుంది. ఈసినిమాపై చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. తాజాగా మరో న్యూస్ వినిపిస్తోంది.
Read Also: JPS Strike: జేపీఎస్ కు సాయంత్రం వరకు డెడ్ లైన్.. లేదంటే టర్మినేట్
పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప- ది రైజ్ పేరుతో రాబోతోంది. ఇక పుష్పతో ప్రపంచ వ్యాప్తంగా బన్నీ క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప-2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, పుష్ప 2 లో ఓ అతిథి పాత్ర ఉందంట. అదే గిరిజన యువతి పాత్ర. ఈ పాత్ర కోసం మెగా డాటర్ నిహారికను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. అంతే కాదు ఆమె ఈ పాత్రకు ఆమె ఒప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా మాత్రం మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు. ఇప్పటి వరకూ రూమర్ గానే ఉన్న ఈ న్యూస్ నిజంగా నిజం అయతే.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నట్టే. బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ అతిథి పాత్ర సినిమాలో చాలా కీలకం అట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను