Site icon NTV Telugu

Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపనైన మీను..!

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు మీనాక్షి సమాధానమిస్తూ.. తనకు ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారని నవ్వుతూ సమాధానం చెప్పారు. నాకు ఒకే ఒక క్రష్ లేదు. చాలా మంది హీరోల్లో నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయి అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Garlic Rice Recipe: ఈ రైస్ ఒక్కసారి చేసుకొని తిన్నారో.. ఇక మీరు బిర్యానీ జోలికి వెళ్లరు..!

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ, “ఆయన నేచర్ నాకు చాలా ఇష్టం. చాలా సింపుల్‌గా, జెన్యూన్‌గా ఉంటారు” అని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని అన్నారు. ఇంకా మహేష్ బాబుతో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ “ఆయన బాడీని, స్కిన్‌ను ఎలా మెయింటైన్ చేస్తారో చూస్తే నిజంగా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది” అని చెప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్, డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే రామ్ చరణ్ డ్యాన్స్ కూడా చాలా ఆకట్టుకుంటుందని మీనాక్షి వెల్లడించారు. ఈ హీరోలందరిలో ఉన్న క్వాలిటీస్ మీద నాకు క్రష్ ఉంది అంటూ మాట్లాడారు.

ఇక హీరోయిన్స్‌లో ఎవరు మీకు ఇన్‌స్పిరేషన్ అని అడిగితే.. అందుకు ఎలాంటి సందేహం లేకుండా నటి ‘సమంత’ పేరు చెప్పారు మీనాక్షి. ఆమె జర్నీ, ఆమె స్టోరీ, ఆమె కష్టపడి ఎదిగిన విధానం నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుందని.. ఫన్ క్యారెక్టర్స్, సీరియస్ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇలా అన్ని ఆమె చేసిందని ప్రశంసించారు.

అలాగే మీనాక్షి పుస్తకాలు చదువుతారా? అనే ప్రశ్నకు “అవును” అంటూ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా భగవద్గీత తన జీవితంపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పారు. ప్రతిసారి భగవద్గీత చదివినప్పుడు, నా జీవితంలోని ఆ దశకు సంబంధించిన కొత్త క్లారిటీ దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం అందుతుందని తెలిపారు. భగవద్గీత నుంచి తాను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘మీ పని మీరు పూర్తి నిబద్ధతతో చేయండి, ఫలితాల గురించి టెన్షన్ పడవద్దు’ అనే సూత్రమని అన్నారు.

Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!

తాను చిన్నప్పటి నుంచి చాలా సీరియస్ స్టూడెంట్‌ని అని.. చదువుల్లోనూ, స్పోర్ట్స్‌లోనూ ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలని అనుకునేదాన్నని మీనాక్షి చెప్పారు. కానీ మార్కులు, రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరిగేదని తెలిపారు. అలాంటి సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తన జీవితాన్ని మార్చేశాయన్నారు. “మీరు మీ పని 100 శాతం చేస్తే, ఫలితాలు ఏవ్ వస్తాయి” అనే ఆలోచన తనకు చాలా బలాన్నిచ్చిందని చెప్పారు.

Exit mobile version