హాట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తరువాత మాస్ రాజా రవితేజ తో ఖిలాడి సినిమా లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో నే కాకుండా గ్లామర్ పరంగా ఎంతో ఆకట్టుకుంది..కానీ ఆ సినిమా అంత గా ఆకట్టుకోలేదు.. ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో నటించింది. ఈ సినిమా తో మంచి విజయం అందుకుంది ఈ భామ. హిట్ 2 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమా లో మొదట పూజా హెగ్డే ను హీరోయిన్‌గా తీసుకున్నారు.కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
దీనితో పూజా హెగ్డే స్థానం లో శ్రీలీలను తీసుకోవడం జరిగింది.అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసారు మేకర్స్.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఇది ఇలా ఉంటే ఈ భామకు తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.వరుణ్ తేజ్ హీరో గా నటించబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ భామకు అవకాశం వచ్చినట్టు సమాచారం . కాగా వరుణ్ తేజ్ పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల27న గ్రాండ్‌గా లాంఛ్ కానుందని సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి దాదాపు ఫైనల్ అయ్యినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నేపథ్యంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.