Meena Dance to Pushpa 2 Song Goes Viral: 90 దశకంలో టాలీవుడ్ లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న మీనా టాలీవుడ్ కి కాస్త దూరమైంది. ఈ మధ్యకాలంలో ఆవిడ తన భర్తను కోల్పోయి ఆ విషాదకర సంఘటన నుంచి బయటికి రావడానికి మీనా మళ్లీ సినిమాల్లో., అలాగే బుల్లితెరపై కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మీనా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. మొదటి భర్త మరణించిన కొన్ని రోజులకే మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు రాగా సోషల్ మీడియా, అలాగే మీడియా కూడా డబ్బు కోసం ఏమైనా రాస్తానన్నారు అంటూ చెబుతూనే.. రోజురోజుకి మీడియా రంగం దిగజారిపోతుందని వాస్తవాలు తెలుసుకుని రాస్తే అందరికీ మంచిదంటూ చెప్పుకొచ్చింది.
Devara Fear Song : దేవర సాంగ్ వచ్చేసింది.. అనిరుథ్ అరిపించాడు మావా!
అయితే ఇప్పుడు ఆమె వెకేషన్ లో ఉంది. ఆ వెకేషన్ లో ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇటీవలే పుష్ప 2 చిత్రంలో నుంచి రిలీజ్ అయిన పుష్ప పుష్ప అనే పాట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నటి మీనా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగాన్ని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఇక సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తోంది.