మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల గర్భవతైన స్వాతిని చంపేందుకే.. ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్‌కు అనుమానం ఉంది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. అనుమానం నేపథ్యంలోనే స్వాతిని కిరాతకంగా చంపేశాడు.
స్వాతిని చంపేసిన అనంతరం ఆమె శరీర భాగాలని మహేందర్ ముక్కలుగా చేశాడు. గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోశాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను విడివిడిగా చేశాడు. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను మహేందర్ తన బండిపై తీసుకెళ్లి మూసీలో పడేశాడు. భార్యను చంపి మృతి దేహాన్ని పడవేసి తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహేందర్ చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. మూసీలో పడవేసిన మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు ఇంకా లభించలేదు.
Also Read: CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
భార్యపై అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతిని మహేందర్ హత్య చేశాడు. భార్యను హత్య చేసేందుకు ముందుగానే ఆక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు. భార్య స్వాతిని గొంతు పిసికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం మహేందర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆక్సా బ్లేడ్‌తో భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. రెండు చేతులు ఓ సంచిలో.. కాళ్లు, తలని మరొక సంచిలో వేసి మూట కట్టాడు. రెండు మూటల్ని తీసుకువెళ్లి పర్వతాపూర్ మోసీలో పడేశాడు. మృతదేహాల మూటలను పడవేసిన తర్వాత మహేందర్ తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. బావ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.