వరంగల్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందినట్లు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యన్‌రాయణ విడుదల చేసిన బులెటిన్‌లో, “మల్లిపుల్ విభాగాల నిపుణులైన వైద్యుల బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.” కాగా, ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడంతో నిమ్స్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొన్ని సంఘాలు సాయంత్రం నిరసనలు చేపట్టడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమ్స్ వద్ద పోలీసు బలగాలను మోహరించారు.
Also Read : Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
ఈ కేసుకు సంబంధించి కేఎంసీలో రెండో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి డాక్టర్ ఎం.ఎ.సైఫ్‌ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. ప్రీతి మృతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ.. బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు.
Also Read : Samantha :13 ఏళ్ల క్రితం సమంత ఇలా ఉండేది.. మీరు చూడండి..