విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాల్లో కొంతమంది మహిళలు, ప్రయాణికులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతుంటారు. అందుకే మనం రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు మీరు డాక్టరా? అని ఆప్షన్ వుంటుంది. డాక్టర్ గానీ, మెడికల్ స్టూడెంట్ గానీ అందులో వుంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వుంటే సాయం చేసేందుకు వీలుంటుంది. తాజాగా ఓ మెడికల్ స్టూడెంట్ చేసిన సాయం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అనకాపల్లి జిల్లాలో జరిగిందీ ఘటన. పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి డెలివరీ చేసి అందరి ప్రశంసలు అందుకుంది ఓ వైద్య విద్యార్ధిని. సికింద్రాబాద్ విశాఖ దురంతో ట్రైన్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిందా మెడిసిన్ విద్యార్థిని. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో ట్రైన్ లో పురుటి నొప్పులు వచ్చాయి. రాజమండ్రి వచ్చేసరికి నొప్పులు పెరగడంతో ఏం చేయాలో ఎవరికీ తెలీలేదు.
అయితే ఆ సమయంలో మెడికల్ స్టూడెంట్ నేనున్నానని భరోసా కల్పించింది. మరో మహిళ సహాయంతో ట్రైన్ లో పురుడు పోసింది ఆ మెడిసిన్ విద్యార్థిని. అనకాపల్లి రైల్వే స్టేషన్ లో అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా వున్నారు. రైలులో మెడిసిన్ విద్యార్థిని చేసిన సాయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వైరల్ అవుతోంది.
Read Also: Jean-Luc Godard: ‘ఫ్రెంచ్ న్యూ వేవ్’కు ఆద్యుడు జీన్ లూక్ గొడార్డ్!
గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా విమానంలో ఓ రోగికి అత్యవసర వైద్యం అందించారు. తమిళి సై డాక్టర్ కావడంతో ఆమె హోదాను పక్కన పెట్టి వెంటనే స్పందించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు.