Gorilla Getup: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో కొన్నాళ్లుగా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వానరల బెడదను తగ్గించేందుకు స్థానిక యువత వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల బాధ తప్పకపోవడంతో.. యువత యూట్యూబ్‌లో పరిష్కార మార్గాల కోసం అన్వేషించింది. ఈ నేపథ్యంలో వారు కాస్త వెరైటీ ఉపాయం కనుగొన్నారు. అదే ‘గెరిల్లా గెటప్’. అవునండి బాబు కోతులను భయబ్రాంతులకు గురి చేయడానికి ఒక వ్యక్తిని అచ్చం పెద్ద గొరిల్లా వేషం ఉన్న డ్రెస్ వేసుకొని ఆ గెటప్‌తో కోతుల గుంపు దగ్గరికి పంపించడం ప్రారంభించారు.
Classic 650 Launch: సరికొత్త స్టైలిష్ లుక్ తో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్..
ఇంకేముంది అందరూ ఊహించినట్లే ఈ భయంకరమైన గెటప్‌తో ఉన్న వ్యక్తిని చూసి కోతులు భయభ్రాంతులకు గురై పారిపోతున్నాయి. ఈ వినూత్న ప్లాన్ ప్రస్తుతం నర్సాపూర్ ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. స్థానిక యువత చేపట్టిన ఈ సృజనాత్మక ప్రయత్నం కోతి మూకల బీభత్సాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తూ.. వాటి బెడదను తగ్గించడంలో కొత్త మార్గాన్ని చూపించింది.
Ajith Kumar – Vijay: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన అజిత్ కుమార్..