వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వక్‌సేన్ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వక్‌సేన్ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు.
Also read: Danam Nagender: కన్ఫూజన్‌లో దానం..! మారనున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి..
రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో విశ్వక్‌సేన్ ఈ సినిమాను చేస్తున్నాడు. మెకానిక్ రాకీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మాతగా వహిస్తున్నారు. నేడు విశ్వక్‌సేన్ పుట్టినరోజు సందర్భంగా మెకానిక్ రాకీ ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే చేతిలో రించ్ ను పట్టుకొని, నోట్లో సిగరెట్కాల్చుతూ ఉన్న ఊర మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు హీరో విశ్వక్‌సేన్.
Also read: Titanic Door: రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపు వేలం.. వామ్మో అన్ని కోట్లకు అమ్ముడబోయిందా..?!
ఇక ఈ సినిమాలో హీరో విశ్వక్‌సేన్ సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. యాక్షన్, కామెడీ అంశాల్ని కలిపి ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్‌సేన్ తన 10 వ సినిమా కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్ర టెక్నికల్ బృందాన్ని చూస్తే.. సంగీతంను జేక్స్ బిజోయ్, DOP గా మనోజ్ కాటసాని, ప్రొడక్షన్ డిజైనర్ గా క్రాంతి ప్రియం, ఎడిటర్ గా అన్వర్ అలీ చేస్తుండగా..,సత్యం రాజేష్, విద్యా సాగర్ జె లు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు గా, జుకళ్యాణికర్ కాస్ట్యూమ్, ప్రీ డిజైనర్ గా, నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనర్ గా, శ్రీహరి పెద్దమల్లు ప్రొడక్షన్ మేనేజర్ గా సినిమాకి పనిచేస్తున్నారు.