Danam Nagender: దానం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి నిచ్చే సాంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలతో తెరపైకి వచ్చారు. ఈనెల 14న దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలకు దానం కలవడంతో దానం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తేలింది. అయితే దానం సీఎం రేవంత్ రెడ్డిని, పలు కాంగ్రెస్ నాయకులను కలిసినా ఇప్పటి వరకు తన ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేయలేదు. దానం ఈనెల మార్చి 17న బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. దానం ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏఐసీసీ ఆయనకు క్లారిటీ ఇచ్చింది.
Read also: Prathinidhi 2 Teaser: పొలిటికల్ కంటెంట్ తో ప్రతినిధి 2 టీజర్..!
దానం ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ఏఐసీసీ చెప్పింది. రేవంత్ రెడ్డితో కలిసిన దానం ముందు ఓకే చెప్పిన, ఇప్పటికి వరకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో దానం హాట్ టాపిక్ అయ్యారు. మొన్నటి వరకు దానం తన సొంత గూటికి వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలకు దానం మరి చెక్ పెట్టీ మళ్లీ బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతారా? అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఏఐసీసీ . సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మళ్ళీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు రావడం.. ఒకటి..రేండు రోజుల్లో ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనున్నట్లు వార్తలు రావడంతో దానం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన దానం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలుస్తారా? లేక ఆ ప్లేస్ లో బొంతు రామ్మోహన్ పోటీ చేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Devineni Uma: దేవినేని ఉమాకు టీడీపీ కీలక బాధ్యతలు..