హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అధికారులు, కార్మిక సంఘాలు. కార్మికుడి డ్రెస్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. మంత్రి శ్రీనివాసయాదవ్ ఈ వేడుకలకు హాజరయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి. చిన్నస్థాయి కార్మికుని నుండి తన జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనం నుండి కష్టపడి ఈ స్థాయికి మల్లారెడ్డి వచ్చారు. మల్లా రెడ్డి కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి కార్మికుని డ్రెస్ కోడ్ తో వచ్చాడు. చాలా పరిశ్రమలు కరోనాన దెబ్బకు విలవిల్లాడాయి. అంతేకాదు, కరెంట్ కోతలతో ఎంతో మంది కార్మికులను తీసివేశారు. పనులు లేక చతికిల పడ్డ కార్మికుల జీవితాలకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుందన్నారు.
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ అందరిని ఆదరిస్తుంది.దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్ కి పని కోసం వస్తారు. కార్మిక సోదరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి శ్రీనివాసయాదవ్.
Women Assault: రేపల్లెలో వివాహితపై అఘాయిత్యం