Mauna Loa Volcano :ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా 38 ఏళ్ల తర్వాత బద్దలైంది. హవాయి బిగ్ ఐలాండ్‌లోని మౌనా లోవా రాత్రి 11:30 గంటలకు విస్ఫోటనం చెందడం ప్రారంభించింది. స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 27న, 1984 తర్వాత మొదటిసారిగా బద్దలైంది. అధికారుల హెచ్చరించిన ఒక నెల తర్వాత అగ్నిపర్వతం పేలింది. ఈ అగ్నిపర్వతం నుంచి ఎరుపు రంగులోని లావా బయటకు ఉబికి వస్తోంది. ‘ప్రస్తుతం అగ్నిపర్వతం ఉన్న భాగం వరకే లావా ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి అగ్నిపర్వతం దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు ఏ ప్రమాదంలేదని అమెరికా జియోలాజికల్ వోలక్రనిక్ యాక్టివిటీ సర్వీసెస్ (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. అయితే.. లావా ప్రవాహం క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. దాంతో, ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు సాధ్యమైనంత తొందరగా హవాయి వొల్కనో అబ్జర్వేటరీ (హెచ్‌వీఓ) సంస్థ ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నట్టు సమాచారం. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా తీవ్రత దాని పరిణామాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వే చేయనుంది. ఈ అగ్నిపర్వతం ఫసిఫిక్ మహాసముద్ర మట్టానికి 13,796 అడుగుల ఎత్తులో ఉంది.
Satellite view from GOES West shows the development of the Mauna Loa eruption and associated plume (Island of Hawaiʻi is in lower left). From https://t.co/oOmUBmf990. Lava remains confined to the summit caldera at this time (1AM HST). pic.twitter.com/5ohKCNoIsL
— USGS Volcanoes🌋 (@USGSVolcanoes) November 28, 2022