Kilauea Volcano In Hawaii Erupts Again: హవాయిలోని కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ పేలింది. జనవరి 5 నుంచి అగ్నిపర్వతం బద్ధలు అవుతూనే ఉంది. గత నవంబర్ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలింది. ఆ తరువాత ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి.
Mauna Loa Volcano :ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా 38 ఏళ్ల తర్వాత బద్దలైంది. హవాయి బిగ్ ఐలాండ్‌లోని మౌనా లోవా రాత్రి 11:30 గంటలకు విస్ఫోటనం చెందడం ప్రారంభించింది.