Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. అవేవో చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావచ్చు. కొత్త నిబంధనల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి. నూతన నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి మీకు ఓ సర్టిఫికేట్ ఇస్తారు.
READ MORE: Good Bad Ugly: ఈసారి సంక్రాంతికి అజిత్ ను దించుతున్న మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
దాని తీసుకుని ఆర్‌టీఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి. ఈ కొత్త రూల్స్ జూన్ నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిబంధనల ముఖ్యఉద్దేశం నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం. పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం. దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని పేర్కొంది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది. లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది. అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి.. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ.. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు యత్నించేవాళ్లు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!