Site icon NTV Telugu

Phone Tapping Case: మావోయిస్టులను పేరు వాడుకుని.. బడా నేతల ఫోన్లు ట్యాప్..!

Phone Tapping Case2

Phone Tapping Case2

దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్ లు పైచేయి అయ్యింది.. అంతేకాదు మావోయిస్టులను ఉమ్మడి రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమివేయంలో కీలక పాత్ర పోషించారు.. గ్రేహౌండ్స్ ఆపరేషన్ నుంచి కోవర్ట్ ఆపరేషన్ వరకు కూడా అన్ని తెలంగాణ పోలీస్ పై స్థానంలో ఉన్నారు.. ఇప్పుడు గత ప్రభుత్వాలలో ఈ మావోయిస్టులను పేరు వాడుకొని పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారు ..అదే ఏమైంది అంటే నిజమే.. మావోయిస్టుల పేర్లు చెప్పి వాళ్ళ సానుభూతుల పేరు చెప్పి వాళ్ళ సహాయం చేస్తున్న వాళ్ళ పేరు చెప్పి వేల ఫోన్ లను టాప్ చేశారు.. టిఆర్ఎస్ ప్రభుత్వ మీద వ్యతిరేక స్వరం వినిపించిన నాయకుల దగ్గర్నుంచి.. పార్టీ మారిన వాళ్ల దగ్గర నుంచి.. అంతేకాకుండా ఇతర పార్టీలో పని చేస్తున్న కీలక వ్యక్తుల తో పాటుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరినైనా తీసుకొని వెళ్తున్నారా అనే సమాచారంతోపాటు ఎన్నికల్లో ఏకంగా ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగలను ఫోన్ టాపింగ్ ద్వారా తెలుసుకొని పైఎత్తులు వేసి చిత్తు చేయడంలో కూడా చాలా విజయం సాధించారు.. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం వలన అయిందని అధికారులు చెప్తున్నారు. రెండు నెలలకు ఒకసారి నాలుగువేల ఫోను ఏకంగా టాప్ చేశారు.. 2023 సాధారణ ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్ మాసంలోనే 600 పై చిలుకు ఫోన్లను ఏకకాలంలో టాప్ చేశారు..

READ MORE: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచిన సిట్‌..!

ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారవేత్తల పాలతోపాటు ప్రతిపక్ష పార్టీలకు ఇతర ప్రాంతాలను చూస్తున్న డబ్బులను అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఎవరైనా హవాల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చేరవేస్తుంటే వెంటనే ఫోన్ టాపింగ్ ద్వారా విషయాన్ని తెలుసుకొని పట్టుకునేవారు.. అంతేకాదు గత ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిన కొన్ని స్థానాలు మీద ఫోకస్ పెట్టారు ..అయితే ఈ వ్యవహారం మొత్తం వెనకాల కూడా ఒక వ్యాపారవేత్త కీలక సూత్రధారిగా ఉన్నాడు.. అతను ప్రతి నియోజకవర్గంలో కూడా సర్వేలో పేరుతో కార్యాలయాలు ఓపెన్ చేశాడు.. ఈ సర్వేల మాటను అతను అక్కడ స్థానికంగా ఉన్న పట్టున్న నాయకులు ..వ్యాపారవేత్తలు ..జర్నలిస్టులు సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళ డాటా మొత్తాన్ని కలెక్ట్ చేశారు..ఈ డేటా మొత్తం ను సదరు మాజీ మంత్రికి ఇచ్చాడు.. సదరు మాజీ మంత్రి నేరుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ పిలిచి పిలిచి డాటా మొత్తాన్ని చేతిలో పెట్టాడు ..ఆ సమయంలో వ్యాపారవేత్తకు ప్రభాకర్ రావు మధ్య మాజీ మంత్రి ఇద్దరికీ పరిచయాలు ఏర్పడ్డాయి ..మీరిద్దరూ కలిసి రాజకీయ ఎత్తుగడలు వేసి తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు ..సదరు మాజీ మంత్రి ఆదేశాలను విన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ఏకంగా సదర్ వ్యాపారవేత్తకు తన దగ్గర పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీతరావుతో పరిచయం ఏర్పరిచారు.. అప్పటికే కలెక్ట్ చేసిన అన్ని ఫోన్ నెంబర్లను తమ డేటాలో ఎక్కించారు.. ఎందుకోసం ప్రత్యేకంగా 50 మందితో ఒక టీంను ఏర్పాటు చేశారు..వీళ్ళు కేవలం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు అనుచరుల ఫోన్ , దాంతోపాటు వాళ్ళ ముఖ్య నాయకుల ఫోన్లో అన్నిటిని ఎప్పటికప్పుడు ట్యాప్ చేసేవారు..

READ MORE: Realtor Murder Case: రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

కాంగ్రెస్ బిజెపి వామపక్షాలు జర్నలిస్టులు మీడియా అధిపతులు జడ్జిలు వ్యాపారవేత్తలు హైదరాబాద్ నగరంలోని హవాలా ఆపరేటర్ల మీద ఫోకస్ పెట్టారు.. ఎవరైనా టిఆర్ఎస్ పార్టీకి జట్కా కొట్టి ఇతర పార్టీలోకి చేరే ప్రయత్నాలు చేస్తుంటే వెంటనే సదరు సమాచారాన్ని ప్రణీతరావు తెలుసుకొని అదనపు ఎస్పీ భుజంగరావుకు సమాచారం ఇచ్చేవాడు.. ఈ అదనపు ఎస్పీ నేరుగా సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా టిఆర్ఎస్ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పేవాడు.. పరిస్థితిని చెక్కదిద్దుకోమని చెప్పేవాడు.. ఎవరైనా వ్యాపారవేత్తలు ప్రతిపక్ష నేతలకు డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తే మార్గమధ్యలోనే వాటిని పట్టుకొని హవాలా డబ్బు అంటూ మీడియాకు చూపెట్టేవారు.. డబ్బుల తరలింపు వ్యవహారాన్ని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్కు అప్పచెప్పారు ఈ నేపథ్యంలో డబ్బులు ఎక్కడ ఉంటే చాలు అక్కడ తన టేబుల్ పంపించి సీజ్ చేసేవాడు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.అయితే, బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.

READ MORE: Best Battery Smartphones: బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!

బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు ఆయన చేర వేసినట్లు తేలింది. దీంతో బీజేపీ నేతల నియోజక వర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు భుజంగరావు సమాచారం ఇచ్చే వారని సిట్ అధికారులు గుర్తించారు.మరోవైపు, రేపటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్ కు బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు తేలింది. ఆయన్ను సిట్ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. రెండు, మూడు రోజుల్లో సిట్ ముందుకు వెళ్లనున్న ప్రేమేందర్ రెడ్డి. ఆయనతో పాటు బీజేపీ ఆఫీస్ సిబ్బందిలో కొందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కానున్నాయా.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్‌ని తెలంగాణలో ట్యాపింగ్ చేశారానే సమాచారం కూడా బయటకు వస్తుంది..బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినిమావాళ్ల ఫోన్లు మాత్రమే కాదు.. ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. చంద్రబాబు, లోకేష్‌లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఫోన్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు అధికారుల నుంచి వస్తున్న సమాచారం…

READ MORE: CM Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన..!

ఆయా ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. . అయితే చాలామంది ప్రముఖుల కాల్ డాటా రికార్డులను బయటికి తీశారు దేనికి తోడు ఐపిడి ఇయర్ దాటాను కూడా తీశారు ఈ రెండు డాటాలను తీసి సదరు ప్రముఖులు ఎవరికి కాల్ చేస్తున్నారు ఎవరితో టెస్ట్ లో ఉన్నారు అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.. ఏకంగా వాట్స్అప్ చాటింగ్ వాట్స్అప్ కాలింగ్ వ్యవస్థను కూడా తీసుకోవడం జరిగింది.. ఎవరికైతే ఈ ప్రముఖులు ఫోన్లు చేస్తున్నారో వాళ్ళ ఫోన్లను వాళ్ళ కుటుంబ సభ్యుల భార్యాపిల్లల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ప్రణీతరావులు టాప్ చేశారు..

Exit mobile version