సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు. అయితే 2006లో పొరపాటున బాలుడి చనిపోయాడు. బాలుడి మృతికి రహీమే కారణమయ్యాడని అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు.. మరోవైపు బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో.. 2018లో అబ్దుల్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం కొన్నాళ్లకు.. ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Gujarat : రూ.200కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్యతో సన్యాసిగా మారబోతున్న వ్యాపారి
ఈ క్రమంలోనే ఈ నెల 18లోగా సుమారు రూ.34 కోట్లు చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఆ మొత్తం సమీకరించి రహీమ్‌ను విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్‌ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా.. కొద్ది మొత్తమే పోగైంది. ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు. ఇలా రూ.34 కోట్లు సేకరించారు. బాధిత కుటుంబానికి ఈ నగదు అందిస్తే రహీమ్ మరణశిక్ష నుంచి బయటపడతాడు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan Tirupati Tour: తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..
తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు వచ్చిందని సంస్థ తెలిపింది. దాదాపుగా ఇప్పటి వరకూ రూ.34.45 కోట్లు వచ్చాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఇక ఎవరూ డబ్బు పంపించవద్దని కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్రస్టు సభ్యులు ప్రజలకు తెలిపారు. రాజకీయ, కుల, మత భేదాలకు అతీతంగా ప్రపంచ కేరళీయులు ఏకమయ్యారని తెలిపారు. ఈ నగదు చెల్లిస్తే.. రహీమ్ మరణశిక్ష నుంచి తప్పించుకుంటాడు.
ఇది కూడా చదవండి: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్.. అసలు మ్యాటరేంటంటే..?!