Site icon NTV Telugu

Operation Sindoor : మోస్ట్ వాంటెడ్‌.. జైషే ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు హతం

Masood Azhar

Masood Azhar

‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషే‌ను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అబ్దుల్ రవూఫ్ అజార్ కందహార్‌లో IC-814 ఫైట్‌ను హైజాక్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ జిహాదీ నెట్ వర్క్‌లలోనూ అజార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.

READ MORE: YS Jagan: మనం గట్టిగా మూడేళ్లు పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే..

కాగా.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మంగళవారం అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల మధ్య భారత సైన్యం ఆపరేషన్ ముగించింది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ పంజాబ్‌లోని బహావల్‌పూర్, మురీద్‌కే, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్‌లీ, ముజఫరాబాద్ లక్ష్యాలుగా మారాయి. బహావల్‌పూర్‌‌, మురీద్‌కేలు ప్రత్యేక టార్గెట్ అయ్యాయి. ఎందుకంటే ఈ రెండూ జైషే మహమ్మాద్, లష్కరే తొయిబా ఉగ్రసంస్థలకు ప్రధాన కేంద్రాలు. 2019 పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినప్పుడు కూడా కోట్‌లీ, బహావల్‌పూర్ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకున్నాయి.

READ MORE: Ameer Khan : ‘మహాభారతం’లో కృష్ణుడి పాత్ర చేస్తా.. అమీర్ ఖాన్ క్లారిటీ..

Exit mobile version