‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.…
పహల్గామ్‌లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత్ నినదించిన వేళ భారత్ పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడుల నేపథ్యంలో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని…