Swift VS Dzire : మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్లో స్విఫ్ట్, డిజైర్ కొత్త జనరేషన్ మోడళ్లను ప్రవేశ పెట్టింది. మారుతి ఈ రెండు కార్లు భారత మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి. మారుతి డిజైర్ న్యూ జనరేషన్ మోడల్ రాకతో ఈ కారు 5-స్టార్ స్టేఫీ రేటింగ్‌ను పొందిన మారుతి మొదటి కారుగా మారింది. మారుతి స్విఫ్ట్, డిజైర్ రెండూ మెరుగైన మైలేజీని ఇస్తాయని కంపెనీ నమ్మకంగా చెబుతుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌తో పాటు సీఎన్జీ వేరియంట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.
మారుతి స్విఫ్ట్ మైలేజ్
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌తో ఈ కారు రాబోతుంది. ఈ మారుతి కారు పెట్రోల్ వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరు ఇంధనానికి 24.80 కి.మీ., ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరు ఇంధనానికి 25.75 కి.మీ. మైలేజీని ఇస్తుందని పేర్కొంది. మారుతి స్విఫ్ట్ కూడా సీఎన్జీలో వస్తుంది. ఈ కారు సీఎన్జీలో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తుంది. ఈ కారు సీఎన్జీ వెర్షన్ లో మైలేజ్ కిలోకు 32.85 కి.మీ. ఇస్తుంది.
Read Also:Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి వేలిముద్రలు మిస్ మ్యాచ్..
మారుతి డిజైర్ మైలేజ్
కొత్త మారుతి డిజైర్‌లో 1.2-లీటర్ జెడ్ -సిరీస్ ఇంజిన్ తో వస్తుంది. ఈ మారుతి కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరు ఇంధనానికి 24.79 కి.మీ.లీ మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో, ఏజీఎస్ ట్రాన్స్ మిషన్ లీటరుకు 25.71కి.మీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. సీఎన్జీ మోడ్‌లో ఈ కారు స్విఫ్ట్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. సీఎన్జీ మోడ్‌లో మారుతి డిజైర్ మైలేజ్ కిలోకు 33.73 కి.మీ. ఇస్తుంది.
మారుతి కార్ల ధరలు
మారుతి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.60 లక్షల వరకు ఉంటుంది. మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి ప్రారంభమై దాని టాప్ మోడల్ ధర రూ. 10.14 లక్షల వరకు ఉంటుంది. మారుతి డిజైర్ బేస్ మోడల్ స్విఫ్ట్ కంటే దాదాపు రూ. 30,000 ఎక్కువ ఖరీదుగా ఉంటుంది. గ్లోబల్ NCAP నుండి క్రాష్ టెస్ట్‌లో మారుతి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
Read Also:Anil Ravipudi : బుల్లిరాజు వ్యాఖ్యలపై ఎటువంటి విమర్శలు లేవు