సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహిస్తుంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల థియేటర్లో. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు ఘన స్వాగతం పలికారు ప్రేక్షకులు.
హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ కథా చిత్రం కావడంతో మంచి ఆదరణ అందించారు. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని మరోసారి రుజువైంది. ఒకటికి ఐదు సార్లు సినిమా చూస్తున్నారు’ అని అన్నారు. అనంతరం సినిమా సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకుంటూ అభిమానులు సమక్షంలో కేక్ కటింగ్ చేసారు హీరో వెంకటేష్. నిర్మాత శిరీష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘మా సినిమా రూ. 100 కోట్లు దాటింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇంత అద్భుతం మైన విజయాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. బుల్లి రాజు వ్యాఖ్యలు పై ఎటువంటి విమర్శలు లేవు. ప్రేక్షకులు బుల్లి రాజును చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ తో ఇప్పటికి నాలుగు సినిమాలు తీశా. అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. మా కాంబోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్లు బాగున్నాయి. ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.