Crime News: విశాఖలో మ్యారేజ్ బ్యూరో అరాచకాలు.. యువతులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు!
- విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు
- యువతులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్న ముఠా
- మీడియాను ఆశ్రయించిన ఓ బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదు. దాంతో సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది.
మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపీడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నారు. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి, మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాళ్లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గర్భం తీయించకపోతే రూ.20 వేలు సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కేటుగాళ్లు ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలకు అబార్షన్ చేయిస్తున్నారు.
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
సుమారు 30 మంది బాధితరాళ్ల నగ్న వీడియోలు చిత్రీకరించి.. డబ్బు కోసం వారిని ముఠా సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. చివరకి ఓ బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. దాంతో మ్యారేజ్ బ్యూరో ముసుగులో చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను ముఠా బారి నుండి రక్షించాలని బాధిత యువతి కోరింది. మరి ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా?, ఫిర్యాదు తీసుకోని పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!